నిమ్మ పండు ఆరోగ్య ప్రయోజనాలు

నిమ్మకాయలో ఉన్న ఔషద గుణాలు అన్నీ ఇన్నీ కావు. నిమ్మ తొక్క నుంచి రసం వరకు ప్రతి ఒక్కటీ శరీరానికి మేలు చేసేవే. నిమ్మలో విటమిన్‌ C, విటమిన్‌ B, కాల్షియం, పాస్పరస్‌, మెగ్నీషియం, ప్రోటీన్స్‌, కార్బోహైడ్రేట్స్‌ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇది యాంటి సెప్టిక్‌గా కూడా పనిచేస్తుంది. నిమ్మ కాయలో 5 శాతం సిట్రిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఆయుర్వేదంతో పాటు పలు రకాల ఔషదాల తయారీకి నిమ్మ పండును వినియోగిస్తుంటారు. అందుకే, నిమ్మను సకల రోగాల నివారణిగా పిలుస్తుంటారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఎక్కువ మంది నిమ్మను రోజువారీ ఆహారంతో తీసుకుంటున్నారు. నిమ్మతో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, రోజూ దీన్ని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని ఆహర నిపుణులు చెబుతున్నారు. మరి, నిమ్మ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూసేద్దామా!

నిమ్మ రసం రక్తంలో కొవ్వు నియంత్రిస్తూ రక్తనాళాల్లో పూడికలు ఏర్పడకుండా కాపాడుతుంది.
నిమ్మ రసంలో తేనె కలుపుకుని తాగితే అజీర్ణం, పైత్యం తగ్గుతాయి. కాలేయం శుభ్రమవుతుంది.
నోటి పూతకు నిమ్మ మంచి ఔషదం.
నిమ్మ రసంలోని సిట్రిక్‌ యాసిడ్‌ కడుపులోని చెడు క్రిములను నాశనం చేస్తుంది.
బాగా నీరసంగా ఉన్నప్పుడు కొబ్బరినీటిలో నిమ్మరసం పిండుకొని తాగడం వల్ల తక్షణ శక్తి కలుగుతుంది.
మంచి పోషక పదార్ధాలతోపాటు నిమ్మరసం తీసుకుంటే మహిళల్లో గర్భస్రావాలు ఉండవు.
జలుబు తగ్గాలంటే నిమ్మ షర్బత్ తాగండి.
జీర్ణక్రియ వ్యాధులైన మలబద్ధకం, అజీర్ణం లాంటి వాటిని తగ్గించటంలో నిమ్మరసం సహాయపడుతుంది.
గజ్జి, తామర, చుండ్రు, మొటిమలు, కుష్టు మొదలైన చర్మవ్యాధులతో బాధపడేవారు నిమ్మరసాన్ని రోజుకు రెండు లేదా మూడుసార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.