ఆశిష్ – వైష్ణవీ చైతన్య జంటగా ‘లవ్ మీ’ సినిమా రూపొందింది. ‘బేబీ’ బ్లాక్ బస్టర్ తరువాత వైష్ణవి చైతన్య చేసిన సినిమా కావడంతో, యూత్ లో ఈ సినిమాపై ఆసక్తి ఉంది. దిల్ రాజు బ్యానర్ పై ఈ సినిమాను హర్షిత్ రెడ్డి – హన్షిత రెడ్డి నిర్మించారు. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు.
ఈ సినిమాలో హీరో దెయ్యంతో రొమాన్స్ చేయాలనే ఒక ఆలోచనలో ఉంటాడు. ఈ విషయంలో ఎవరు ఎంతగా చెబుతున్నా వినిపించుకోకుండా ముందుకు వెళతాడు. ఫలితంగా ఏం జరుగుతుంది? అనేది కథ. నిజానికి ఇది కాస్త చిత్రంగా అనిపించినా, కొత్తగా అయితే ఈ పాయింటును టచ్ చేశారు. ఆ పాయింట్ తో ఎంతవరకూ మెప్పిస్తారనేది చూడాలి మరి.