‘మా’ఎలక్షన్ నామినేషన్ వేసిన ప్రకాశ్ రాజ్

మరో రెండు వారాల్లో ‘మా’ ఎన్నికలున్న వేళ… తాజాగా సోమవారం ఉదయం సినీనటుడు ప్రకాష్‌ రాజ్‌ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోషియేషన్‌ ఎన్నికల నామినేషన్‌ వేశారు. ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గా శ్రీకాంత్‌ కూడా నామినేషన్‌ వేశారు. నేటి నుంచి నుంచి ఈ నెల 29 వరకూ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్‌ ఉపసంహరణకు వచ్చే నెల 1, 2 తేదీల్లో సాయంత్రం 5 గంటల వరకూ గడువు ఇస్తారు. అక్టోబర్‌ రెండో తేది సాయంత్రం బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. అక్టోబర్‌ 10 న ఎన్నికలు జరుగుతున్నాయి. అదే రోజు రాత్రి ఏడు గంటలకు ఫలితాలను కూడా వెల్లడించబోతున్నారు.