అజ్ఞాతం వీడిన వైసీపీ వివాదస్పద ఎమ్మెల్యే

pinneli.jpg

వైసీపీ వివాదస్పద ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతం వీడారు. హై కోర్టు అదేశాల మేరకు నరసరావుపేటలో ఎస్పీ కార్యాలయానికి మాచర్ల వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేరుకున్నారు. మాచర్లలో జరిగిన ఘటనలకు సంబంధించి 3 కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు వచ్చింది.

ప్రతిరోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని,నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోనే ఉండాలని హై కోర్టు షరతులు విధించింది. దీంతో జిల్లా పోలీస్ కార్యాలయంలో తన పూర్తి వివరాలు అందజేశారు మాచర్ల వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.

Share this post

scroll to top