సూపర్ స్టార్ కి విషెస్ చెప్పిన ‘ప్రిన్స్’

తెలుగు చిత్ర సీమలో సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుని మూడు వందలకి పై చిలుకు చిత్రాలలో నటించిన కృష్ణ. తన సినీ కెరీర్ లో ఎన్నో సాహసాలని చేసిన సూపర్ స్టార్ కృష్ణ నేటితో (సోమవారం) 78వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన తనయుడు, హీరో మహేష్‌ బాబు ట్విటర్‌ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ బర్త్‌డే నాన్న. నేను ముందుకెళ్లడానికి ఎప్పుడూ నాకు అత్యుత్తమైన మార్గాన్ని చూపించినందుకు ధన్యవాదాలు. మీరు అనుకునేదాని కంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తుంటాను నాన్న’ అంటూ బర్త్‌డే విషెస్‌ను తెలిపారు. కృష్ణ కి ఆయన కూతురు మంజుల, అల్లుడు సుదీర్ బాబుతో పాటు సినీ ప్రముఖులు ఆయనకీ జన్మదిన శుభాకాంక్షలని తెలియ జేశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ ల హవా నడుస్తున్న రోజులలో సినీ రంగ ప్రవేశం చేసిన కృష్ణ ఆనతి కాలంలోనే అగ్ర నటుడిగా పేరు సంపాదించారు. నిర్మాతల హీరో గా పేరు తెచ్చుకున్న కృష్ణ పద్మాలయా స్టూడియో నిర్మించడమే కాకుండా పద్మాలయా బ్యానర్ పై ఎన్నో విజయవంతమైన చిత్రాలని తెలుగు తెరకి అందించారు.