చలికాలం వస్తుందంటే చాలు జనాలు చలితో వణికిపోతారు. పైగా దీనికి తోడు కాలాలతో సంబంధం లేకుండా వర్షాలు కూడా పడుతున్నాయి. సాధారణ రోజుల కన్నా శీతాకాలంలో గాలిలోని తేమ అధికంగా ఉంటుంది. దీంతో క్రిముల సంఖ్య పెరుగుతుంది. రోగాలు వస్తాయి. కాగా మన బాడీకి ఇమ్మూనిటి పవర్ ను పెంపొందించుకోవాలంటే, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే తప్పకుండా ప్రతిరోజూ ఒక స్పెషల్ టీ తాగాల్సిందే.
అల్లం విత్ పసుపు టీ
భోజనం తర్వాత ప్రతి రోజూ అల్లం విత్ పసుపు టీ తాగితే అనేక ప్రయోజనాలున్నాయి. కాగా ఒక గ్లాస్ వాటర్ లో కొంచెం తురిమిన అల్లం, పసుపు వేసి మరిగించుకోండి.
దాల్చిన చెక్కతో టీ..
సాధారణంగా మెటబాలిజం బాడీ ఇమ్యూనిటి పవర్ ను పెంచుతుంది. కాగా దాల్చిన చెక్కను వాటర్ లో మరిగించి వడపోసి తాగితే శరీరానికి కావాల్సినంత రోగనిరోధక శక్తిని అందిస్తుంది.
ఉసిరి టీ..
ఒక గ్లాస్ మరిగించిన వాటర్ లో ఒక చెంచా జీలకర్ర మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత పుదీనా ఆకులు, కొంచెం అల్లం, వేసి వడకట్టి తాగితే ఇమ్యూనిటి పవర్ పెరుగుతుంది.
తులసి ఆకులతో టీ..
తులసి ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. తులసి టీ తాగితే శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో మేలు చేస్తుంది. కాగా ఒక గ్లాస్ వాటర్ లో కొన్ని తులసి ఆకులను మరిగించండి. అందులో పావు చెంచా మిరియాలపొడి మిక్స్ చేసి వడపోసి తేనెతో కలిపి తాగితే చలికాలం వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు.