టాలీవుడ్ లో మరో భారీ మల్టీ స్టారర్ మూవీ రానుంది. మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లం కొండ శ్రీనివాస్ కలిసి నటించిన తాజా చిత్రం భైరవం. విజయ్ కనకమేడల తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇప్పటివరకు ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్లు, టీజర్స్ ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింద్ దాదాపు తుది దశకు వచ్చేసింది. ఈ నెల 30న భైరవం సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఇప్పటికే షురూ చేశారు. కాగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఓ అడవిలో జరుగుతోంది. అయితే టీమ్ అందరికీ హోటల్ ఫుడ్ తెప్పిచ్చే బదులు షూటింగ్ ప్రాంతంలోనే రుచికరమైన వంటకాలు తయారుచేశారు. హీరోలు మంచు మనోజ్, నారా రోహిత్ గరిటె పట్టి బిర్యానీ, గారెలు వంటి పసందైన వంటకాలు దగ్గరుండి వండారు.
అనంతరం చిత్ర బృందానికి ఈ రుచికరమైన వంటకాలను వడ్డించారు. ఇందుకు సంబంధించిన వీడియోను చిత్ర బృందం తమ సోషల్ మీడియాలో ఖాతాల్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. దీనిని చూసిన వారందరూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా భైరవం సినిమాలో డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే జయసుధ, అజయ్, సందీప్ రాజ్, శరత్ లోహితస్వ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ నుంచి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.