సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, జ్ఞానవేల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘వెట్టైయాన్’. ఇందులో అమితాబ్ బచ్చన్, రానా, ఫాహద్ ఫాజిల్, మంజు వారియర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఇటీవల ఈ మూవీ నుంచి ‘మనసిలాయో’ సాంగ్ విడుదలై యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఈ పాటలో అదిరిపోయే స్టెప్పులేసి మంజు వారియర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంజు వారియర్ వెట్టైయాన్‌లో భాగం కావడంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘మనసిలాయో పాటకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సెలబ్రేషన్ సాంగ్‌ను నేను చాలా సినిమాల్లో చూశా. కానీ ఇప్పుడు ఈ సాంగ్‌లో డ్యాన్స్ చేయడం నాకు సరదాగా అనిపించింది. అంతమంది డ్యాన్సర్లు సెట్స్‌లో ఉండగా ఒకే రిథమ్‌లో హుక్ స్టెప్ చేయడం నాకు చాలా బాగా అనిపించింది. అయితే ఈ సినిమాలో నటించినప్పుడు రజినీకాంత్ హీరో అని చెప్పడంతో డబుల్ హ్యాపీగా ఫీలయ్యాను. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం గౌరవంగా భావిస్తున్నాను