టీ ప్రియుల మాదిరిగానే భారతదేశంలో కాఫీ ప్రియులకు కొదవలేదు. ఆఫీసులో పని చేస్తున్నప్పుడు బద్ధకాన్ని తరిమికొట్టాలనుకుంటున్నా లేదా తాజాగా రోజును ప్రారంభించాలన్నా ముందుగా ఒక కప్పు కాఫీ తాగడానికి ఇష్టపడతారు. కాఫీ అనేక కలయికలతో ఉన్నప్పటికీ, వాటిలో అమెరికన్ కాఫీ, ఎస్ప్రెస్సో, డబుల్ షాట్ ఎస్ప్రెస్సో, లాట్టే, మాక్ కాటో, ఫ్రాప్పే, మోచా బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రస్తుతం మనం మష్రూమ్ కాఫీ గురించి మాట్లాడబోతున్నాం. అవును మీరు ఎప్పుడైనా మష్రూమ్ కాఫీ తాగారా ? ఇది రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మరి ఆ కాఫీ ఎలా తయారు చేసుకోవాలి, ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మష్రూమ్ కాఫీ 1930, 1940 లలో కాఫీ ప్రియులకు అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ కాఫీని ఔషధంగా ఉపయోగించారు. ఇది శక్తిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు తెలిపారు.