ఏపీలో రైతులకు శుభవార్త చెప్పిన మంత్రి..

manohar-12.jpg

ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త చెప్పారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నుంచి 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని ప్రకటించారు. ఏలూరులో రైతులకు ధాన్యం బకాయిల విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకు చెల్లించే డబ్బుల విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని సమయానికి వారికి డబ్బులు విడుదలయ్యేలా చూస్తామన్నారు. పెండింగ్ బకాయిల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించడంతో వెంటనే అధికారులు చర్యలు చేపట్టారన్నారు. గత నెలలో రూ.వెయ్యి కోట్ల బకాయిలను రైతులకు విడుదల చేశామని మిగిలిన రూ.674 కోట్లు అందిస్తున్నామన్నారు. అలాగే పంటను నష్టపోయిన కౌలు రైతులను ఆదుకునే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు.

Share this post

scroll to top