గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో శ్రీ మహంకాళి అమ్మవారిని మంత్రి నారా లోకేష్ గురువారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు పండితులు వేదాశీర్వచనం పలికి..లోపలికి ఆహ్వానించారు. అనంతరం అమ్మవారికి మంత్రి లోకేష్ మొక్కులు చెల్లించుకున్నారు. నూతనంగా నిర్మిస్తున్న దేవాలయాన్ని పరిశీలించారు. ఆలయానికి పెద్ద ఎత్తున వస్తున్న ప్రజలను చూసి ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి లోకేష్ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో రోడ్లు, పార్కింగ్, భక్తులకు సౌకర్యాలు, ఆలయ అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం చుట్టు పక్కన గ్రామాల నుంచి తనను కలవడానికి వచ్చిన ప్రజలను ఆప్యాయంగా పలకరించి వినతులు స్వీకరించారు.