తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు బాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. “ఢిల్లీ విమానాశ్రయంలో తలైవర్ కలైంగర్ కరుణానిధికి చిరకాల మిత్రుడు చంద్రబాబును కలిశాను. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తాం. కేంద్రంలో ఆయన కీలకపాత్ర పోషిస్తారని నాకు నమ్మకం ఉంది. దక్షిణాది రాష్ట్రాల కోసం పోరాడుతూ మన హక్కులను కాపాడతారని విశ్వసిస్తున్నా” అని ఆయన ట్వీట్ చేశారు.
- Home
- News
- Andhra Pradesh
- చంద్రబాబును కలిసిన స్టాలిన్