బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ కు చేరుకున్నారు. బుధవారం సాయంత్రం ఢిల్లీ నుంచి రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. కవితో పాటు కేటీఆర్ సహా కుటుంబసభ్యులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలు ఉన్నారు. దాదాపు ఐదు నెలల తర్వాత కవిత హైదరాబాద్‌కు వచ్చారు. ఇదిలా ఉండగా కవిత రాక సందర్భంగా 500 కార్లతో ఆ పార్టీ శ్రేణులు భారీగా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బంజారాహిల్స్‌లోని కవిత నివాసానికి ఆమెకు భారీ ర్యాలీగా తీసుకురావాలని నిర్ణయించారు. ఇంటికి వచ్చాక ఇవాళే కేసీఆర్‌తో కవిత భేటీ కానుంది.