తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిల భేటీపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ స్పందించారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామరస్యంగా విభజన హామీలను పరిష్కరించుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలకు కట్టుబడి ఉందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టి హిందు భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించాలని ఏపీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. దేశ సమగ్రత కోసం ప్రాణాలను అర్పించిన గొప్ప వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని లక్ష్మణ్ పేర్కొన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పశ్చిమ బెంగాల్‌లో చిన్న వయసులో వైస్ ఛాన్సలర్‌గా ఎమ్మెల్సీగా, ఎంపీగా ఎన్నికయ్యారని లక్ష్మణ్ తెలిపారు.