రెండు లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తామని ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టగానే వాటి ఊసే ఎత్తడం లేదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. మల్లాపూర్ వీఎన్‌ఆర్ గార్డెన్స్‌లో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ బాలచందర్ ఆధ్వర్యంలో ఉప్పల్ అసెంబ్లీ కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ… కాంగ్రెస్ సర్కారుపై అవిశ్వాసం ప్రకటించిన నిరుద్యోగ యువత యుద్ధం చేస్తున్నారని విమర్శించారు. పీర్జాదిగూడలో 1985లో ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్లను రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం కూల్చడం సరికాదన్నారు. ఉప్పల్‌లో 35 ఏళ్ల క్రితం పేదలు నిర్మించుకున్న ఇళ్లను వక్ఫ్ భూములు అంటూ ప్రభుత్వ స్థలాలుగా చెప్పడంపై మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ఎన్‌వీఎ్‌సఎ్‌స ప్రభాకర్, భేతి సుభాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.