బీజేపీ చీఫ్‌ పురందేశ్వరికి కీలక పదవి..

bjp-23-.jpg

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర బీజేపీ చీఫ్‌, పార్లమెంట్‌ సభ్యులు దగ్గుబాటి పురందేశ్వరికి కీలక పదవి దక్కింది. ఈ మేరకు లోక్‌ సభ స్పీకర్‌ ప్రకటన చేశారు. కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ చైర్ పర్సన్ గా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర బీజేపీ చీఫ్‌, పార్లమెంట్‌ సభ్యులు దగ్గుబాటి పురందేశ్వరి నియామకం అయ్యారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఇండియా రీజియన్ ప్రతినిధిగా కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ సభ్యురాలిగా నామినేట్ అయ్యారు పురంధేశ్వరి. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా. 2026 చివరి వరకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర బీజేపీ చీఫ్‌, పార్లమెంట్‌ సభ్యులు దగ్గుబాటి పురందేశ్వరి నియామకం వర్తించనుంది. మహిళా పార్లమెంటేరియన్లు, స్టీరింగ్ కమిటీకి చైర్‌పర్సన్‌గా కూడా ఆమె వ్యవహరిస్తారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఓం బిర్లా.

Share this post

scroll to top