సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే..

nbk-29.jpg

రెండు తెలుగు రాష్ట్రాలు, నంద‌మూరి అభిమానులు ఎదురు చూస్తున్న స‌మ‌యం ఎట్టకేలకు వ‌చ్చేసింది. బాలకృష్ణ తనయుడు స్క్రీన్ పై ఎప్పుడు కనిపిస్తాడా అని చాలామంది ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పుడు వాట‌న్నింటికి చెక్ పెడుతూ నందమూరి నట వారసత్వాన్ని కొనసాగిస్తూ క్రియేటివ్ మేకర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి తారక రామారావు మనవడు మరియు నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా మేకర్స్ నుండి వచ్చిన ఓ సూపర్ అప్డేట్ ఫ్యాన్స్ ని తబ్బి ఉబ్బి పోయేట్లు చేస్తుంది.

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమైన ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి తన సినిమాస్‌పై లెజెండ్ ప్రొడక్షన్స్‌తో కలిసి భారీ స్థాయిలో బ్యాంక్రోల్ చేయనున్నారు. బాలకృష్ణ చిన్నకూతురు తేజస్విని నందమూరి ఈ చిత్రానికి సమర్పకురాలిగా వ్యవహరించనుంది. కాగా ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ 5 నుండి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ అనే హాష్ టాగ్ తో ‘గెట్ రెడీ ఫర్ సమ్ యాక్షన్’ అంటూ పోస్ట్ చేశారు.

Share this post

scroll to top