టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి శాసనసభ్యుడు నారా లోకేశ్, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి కూడా ఇప్పటికే వేదిక వద్దకు చేరుకున్నారు. నందమూరి చైతన్యకృష్ణ, నారా రోహిత్ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు.
అటు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా విజయవాడలోని నోవాటెల్ హోటల్ నుంచి కేసరపల్లి ఐటీ పార్కుకు బయల్దేరారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారు.