చిరంజీవి కూతురు శ్రీజ వల్లే ఇదంతా.

శ్రీజ వల్లే ఇదంతా.. మ్యాటర్ మొత్తం చెప్పేసిన నిహారిక

కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న ఈ పరిస్థితులు అందరినీ ఇళ్లలోనే కట్టిపడేశాయి. ప్రభుత్వ ఆదేశాలనుసారం ప్రతీ వ్యక్తీ ఇంట్లోనే ఉంటూ కరోనా నివారణ చర్యల్లో భాగమవుతున్నాడు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు సరికొత్తగా ఆలోచించి ఇంట్లోనే ఉంటూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే బాధ్యత భుజాలపై వేసుకున్నారు. హీరోలంతా ‘బీ ది రియల్ మెన్’ అంటూ ఇంట్లో లేడీస్‌కి సాయపడాలని చెబుతుంటే.. మెగా ఫ్యామిలీ లేడీస్ మాత్రం ఆడవాళ్లు ఎక్కువగా ఇష్టపడే మేకప్ టెక్నిక్‌పై కన్నేసి ఓ వీడియో రూపొందించారు.

ఈ వీడియోలో మెగా ఫ్యామిలీ అమ్మాయిలంతా కలిసి ‘పాస్ ది బ్రష్’ అంటూ “మేకప్ వేసుకోక ముందు, వేసుకున్న తరువాత కనిపిస్తూ డాన్స్ చేశారు”. ఇందులో మెగాస్టార్ చిరంజీవి కూతుళ్లతో పాటు నాగబాబు కూతురు నిహారిక, అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి సహా ఇంకొందరు మెగా ఫ్యామిలీ లేడీస్ పాల్గొన్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో వదలడంతో వైరల్ అయింది. చాలామంది లేడీ ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యారు. అయితే తాజా ఇంటర్వ్యూలో ఈ వీడియో రూపొందించడానికి కారణం శ్రీజ అక్కే అని చెప్పింది నిహారిక.