ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు పదవీ బాధ్యతలు స్వీకరించారు.. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ.. పోలవరం నుండి ఎత్తి పోతల వరకు ప్రతి ప్రాజెక్ట్స్ ను ప్రాధాన్యత క్రమంలో నిర్మాణాలు పూర్తి చేస్తాం అన్నారు. ఇరిగేషన్ నిధులు దారి మళ్లించి వైసీపీ నాయకుల జేబుల్లోకి మల్లించుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు సీఎంగా పరిపాలన తెలిసిన నాయకుడు ఉన్నారు.. సోమవారాన్ని.. పోలవారంగా మార్చుకున్న ఘనత సీఎం చంద్రబాబుది అని గుర్తుచేశారు. గత పాలకులు పోలవరాన్ని అడ్డుకుని మూలన పెట్టారు.. జగన్ విధ్వంసానికి పోలవరం ఒక సాక్షిగా ఉందన్నారు. 2019 లో వైసీపీ అధికారంలోకి రాగానే రివర్స్ టెండరింగ్ పేరు తో పోలవరాన్ని అడ్డుకున్నారు.. ఏజెన్సీలను మార్చేశారు.. అధికారులను బదిలీ చేసశారు.. జలశక్తి శాఖ నోటీసులు ఇచ్చినా ప్రభుత్వంలో మార్పు రాలేదు అని మండిపడ్డారు.