లోక్‌స‌భ డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వి ఎవ‌రికి? ఎన్డీయే ఆలోచ‌న అదేనా!

looksabha-01.jpg

లోక్‌స‌భ‌ డిప్యూటీ స్పీకర్ ఎవరనే అంశం ఆసక్తికరంగా మారింది. ఒకవైపు.. ఆ పదవిని తమ కూటమి సభ్యుడికే ఇవ్వాలని బీజేపీ యోచిస్తుండ‌గా… మరోవైపు విపక్ష కూటమిలో భాగమైన తృణమూల్‌ కాంగ్రెస్‌ మాత్రం సమాజ్‌వాదీ పార్టీకి చెందిన‌ ఫైజాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికైన  అవధేశ్‌ ప్రసాద్‌కు ఆ సీటు ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తోంది. ఈ ప్ర‌తిపాద‌న‌కు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మద్దతు పలికింది.

అయితే డిప్యూటీ స్పీక‌ర్ నియామ‌కంపై ప్ర‌తిష్టంభ‌న కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. ఈ విష‌యంపై కేంద్రం, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగే అవ‌కాశాలు లేన‌ట్లు స‌మాచారం,  డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వి త‌మ‌కే ఇవ్వాలంటూ ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న డిమాండ్‌ను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే విమ‌ర్శిస్తోంది. డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు ఇవ్వకూడదని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండ‌గా  2019 నుంచి  లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంది. గ‌తంలో ఎక్కువ శాతం ప్రతిపక్షమే ఈ ప‌ద‌విని కేటాయించారు. అయితే  ఇది ఎల్లప్పుడూ కొన‌సాగ‌ద‌ని బీజేపీ చెబుతోంది. ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీకి లోక్‌స‌భ‌లో ప్రతిపక్ష హోదా ఉండ‌టంతో.. తమ ఎంపీల‌లో ఒకరికి డిప్యూటీ ప‌ద‌వి ద‌క్కాల‌ని డిమాండ్ చేస్తోంది.  

కాగా 16వ లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని అన్నాడీఎంకేకు ఇవ్వగా, 17వ లోక్ ‌సభ పదవీ కాలం మొత్తం ఈ పోస్టు ఖాళీగానే ఉంది. భారత పార్లమెంట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఈసారి కూడా . అయితే డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సంబంధించి ఇంకా అధికారిక షెడ్యూల్ విడుదల కాకపోవడంతో ఆ పదవిపై రాజకీయ దుమారం కొనసాగుతూనే ఉంది.. 

ఇక‌ స్పీకర్‌ పదవిపై అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో 48 ఏళ్ల తర్వాత ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఇండియా కూటమి అభ్యర్థి కె.సురేశ్‌పై ఓం బిర్లా విజయం సాధించి రెండ‌వసారి స్పీక‌ర్ ప‌ద‌విని చేప‌ట్టారు.

Share this post

scroll to top