రోజూ బాదం తింటున్నారా..? అయితే జాగ్రత్త..!

మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారాన్ని తీసుకోవడం ఎంత ముఖ్యమో తెలిసిందే. అలాంటి మంచి ఆహారాల్లో నట్స్, సీడ్స్ ముఖ్యమైనవి. నట్స్‌లో ఎక్కువ మంది బాదం పప్పులు తినేందుకే ఇష్టపడతారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా దీనికి మాంచి డిమాండ్ ఉంది. ప్రస్తుత శాఖహార ట్రెండ్‌లో చాలామంది బాదం పాలు, బాదం బటర్ తదితర వెరైటీలను ఆస్వాదించేందుకు ఇష్టపడుతున్నారు. మరి, బాదం పప్పులు ఎంతవరకు మీకు ఆరోగ్యాన్ని అందిస్తాయి? అవి శరీరానికి మేలు చేస్తాయా లేదా? వీటిని ఏ విధంగా తీసుకోవాలనే విషయాలను మనం కచ్చితంగా తెలుసుకోవాలి.

బాదంలో బోలెడన్ని పోషకాలు ఉన్నాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. గుప్పెడు (సుమారు 28 గ్రాములు) బాదం పప్పులు 161 క్యాలరీలు శరీరానికి అందిస్తాయట. ఇంకా ఇందులో 3.5 గ్రాముల ఫైబర్, 6 గ్రాముల ప్రోటీన్, 2.5 గ్రాముల పిండి పదార్థం, 14 గ్రాముల కొవ్వు, 37 శాతం విటమిన్-E, 32 శాతం మెగ్నీషియం ఉంటాయట. దీనివల్ల శరీరానికి ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చూడండి.