కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జస్టిస్ పీసీ చంద్రఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. తాజాగా కాళేశ్వరంపై రిపోర్ట్‌ను కమిషన్‌కు కాగ్ (CAG) అందజేసింది. ఎన్‌డీఎస్‌ఏ, విజిలెన్స్ ఫైనల్ రిపోర్టు ఇవ్వాలని మరోసారి కాళేశ్వరం కమిషన్ ఆదేశించింది. 14 మంది పంప్ హౌస్ ఇంజనీర్లు నేడు కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఈనెల 16వ తేదీ వరకు ఆఫ్రిడేవిట్లను ఫిల్ చేయాలని ఇంజనీర్లను కమిషన్ ఆదేశించింది.