రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నాయని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం బిజెపి కార్యకర్తలు ప్రజల కృతజ్ఞత సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. 44 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ గడ్డమీద బీజేపీ సంపూర్ణంగా జెండా ఎగుర వేసిందన్నారు. మల్కాజ్గిరి, సికింద్రాబాద్, మెదక్, చేవెళ్ల స్థానాలను గెలుచుకుందనీ తెలిపారు.