పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు సీఎంకే బర్తే డే విషెస్ చెబుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఆ భగవంతులు మీకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు ప్రసాదించాలని తెలంగాణ రాష్ట్రాన్ని మరింత సుభిక్షం వైపు నడిపించే శక్తి ప్రసాదించాలని ఆకాంక్షించారు. మరో వైపు సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టిన రోజు పురస్కరించుకుని సీఎం ఇవాళ యాదగిరిగుట్టలోని లక్ష్మినరసింహ స్వామిని దర్శించుకున్నారు.