ఎర్రచందనం అరికట్టేందుకు ప్రణాళిక..

pavan-8.jpg

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్నాటక పర్యటనకు వెళ్లారు. ఎర్రచందనం అక్రమ రవాణా నివారణ చర్యలపై కర్నాటక అటవీశాఖ మంత్రితో చర్చించేందుకు వెళ్లారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో కర్నాటక సీఎం సిద్దరామయ్యను మర్యాద పూర్వకంగా కలిశారు. పొరుగు రాష్ట్రాల సహకారంతో ఎర్రచందనం దోపిడీని అరికట్టేందుకు ప్రణాళిక రచించనున్నారు పవన్. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు కలిసి పని చేయాలని, కర్ణాటక నుండి 6కుంకీ ఏనుగులను ఏపీకి ఇవ్వాలని కర్నాటక అటవీశాఖ మంత్రిని కోరారు పవన్ కళ్యాణ్. పొలాల మీద, ఊళ్ళ మీద పడే ఏనుగులను తరిమేందుకు కుంకీ ఏనుగులు ఉపయోగపడతాయని అటవీ అధికారులు గతంలో పవన్ కి తెలిపారు. ప్రస్తుతం ఏపీలో కేవలం రెండు కుంకీ ఏనుగులు మాత్రమే ఉన్నాయని తెలిపారు అధికారులు. కర్నాటకలో కుంకీ ఏనుగులు ఉంటాయని అధికారులు తెలపగా స్వయంగా తానే వెళ్లి కర్నాటక ప్రభుత్వాన్ని కోరుతానని అన్నారు పవన్ కళ్యాణ్.

Share this post

scroll to top