ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జగిత్యాల జిల్లాలోని కొండగట్టు శ్రీ అంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. పవన్ కల్యాణ్ ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్‌కు ఆలయ అర్చకులు వేందమంత్రోత్చరణలతో ఆశీర్వచనం చేశారు. అయితే.. ఏపీలో ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ వారాహి యాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. వారాహి వాహనానికి పూజ చేయించేందుకు పవన్ కల్యాణ్ కొండగట్టు వచ్చారు. ఈ క్రమంలోనే.. ఎన్నికల్లో గెలిచిన తరువాత మొదటి సారి డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. అయితే.. పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో కొండగట్టు అంజన్న క్షేత్రంలో పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహించారు. సిద్ధిపేటలో పవన్ అభిమానులు గజమాలతో సత్కరించారు. కారుపైకి ఎక్కి అభిమానులకు పవన్ అభివాదం చేశారు. జై జనసేన, జై పవన్ కల్యాణ్, సీఎం.. సీఎం అంటూ జనసైనికులు నినాదాలు చేశారు. దీంతో పవన్ కల్యాణ్ వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరిన పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం కొండగట్టు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నారు.