అపర్ణ మల్లాది దర్శకత్వంలో నటి అనీషా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పెళ్లి కూతురు పార్టీ’. ఆగస్టు 31న ఆహా వేదికగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. అక్క పెళ్లి కుదిరిన ఆనందంలో చెళ్లెళ్లు అందరూ రోడ్ ట్రిప్‌నకు వెళ్లి పార్టీ చేసుకుంటారు. ఆ సమయంలో వారికి ఎదురైన సంఘటనలు, వాటిని వాళ్లు ఎదుర్కొన్నారు అనే ఆసక్తికర అంశాలతో రూపుదిద్దుకుంది. యుత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో అన్నపూర్ణ కీలకపాత్ర పోషించారు.
