అసెంబ్లీలో ‘వారి’ ప్రస్తావనే తేలేదు.. : పేర్ని నాని

అసెంబ్లీలో ఎవరూ చంద్రబాబు కుటుంబ సభ్యులు, వారి శ్రీమతి ప్రస్తావనే తేలేదని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. అసెంబ్లీలో వ్యవసాయం మీద చర్చ జరుగుతుంటే దానిపై మాట్లాడకుండా అనవసర మాటలతో రాద్దాంతం చేసింది చంద్రబాబేనని అంటూ నాని అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు సతీమణిని ఎవరైనా ఏమైనా అని ఉంటే ఆ ఫోన్‌ రికార్డును బయట పెట్టాలని పేర్ని నాని డిమాండ్‌ చేశారు. శాసనసభలో చంద్రబాబు తన అనుభవాన్ని రంగరించి మెలో డ్రామా సఅష్టించారన్నారు. రాజకీయాలను రాజకీయాలతోనే ఎదుర్కోవాలని సూచించారు. కుటుంబ మర్యాదను పక్కన పెట్టి చంద్రబాబు ఈ డ్రామా చేశారని వ్యాఖ్యానించారు.