ఆయిల్ స్కిన్, డెడ్ స్కిన్ సెల్స్ కారణంగా జుట్టు యొక్క హెయిర్ ఫోలికల్స్ మూసుకుపోయినప్పుడు మొటిమలు ఏర్పడతాయి. హార్మోన్ల అసమతుల్యత, చర్మంలో అదనపు నూనె ఏర్పడటం, బ్యాక్టీరియా చేరడం, ఇంకా వాపు వంటి అనేక కారణాల వల్ల ఇది జరుగుతుంది. హార్మోన్ల అసమతుల్యత ప్రధానంగా కౌమారదశ, ఋతుస్రావం, గర్భం, ఒత్తిడి కారణంగా సంభవించవచ్చు. ఇది కాకుండా.. కొన్ని మందులు, జన్యువులు, సరైన ఆహారం, చర్మ సంరక్షణ తీసుకోకపోవడం వంటి జీవనశైలి కారకాలు వీటికి ప్రధాన కారణం కావచ్చు. ముఖం మీద మొటిమలు, మచ్చలు రావడం ఎవరికి ఇష్టం ఉండదు. కానీ., చాలా మంది ప్రజలు ఎదుర్కొనే సమస్య ఇది. ముఖ్యంగా మహిళలు మొటిమల కారణంగా ఆత్మవిశ్వాసం కోల్పోవాల్సి వస్తుంది. ముఖంపై మొటిమలు రావడం సహజమే అయినా వీటి వల్ల ముఖ సౌందర్యం పాడవుతుంది. చాలా సార్లు, ప్రజలు వీటితో ఇబ్బంది పడతారు. దీనికోసం మందులను ఆశ్రయించడం ప్రారంభిస్తారు. అయితే సమతుల్య ఆహారం తీసుకోవడం, పుష్కలంగా నీరు త్రాగడం ద్వారా మొటిమలను నివారించవచ్చని, అలాగే చర్మం కూడా మెరుస్తూ ఉంటుందని తెలుసా మీకు.
నీరు పుష్కలంగా త్రాగాలి:
మీరు మీ శరీరాన్ని సరిగ్గా విశ్రాంతిని గురిచేస్తే లోపల నుండి మీకు చర్మ సమస్యలు తక్కువగా ఉంటాయని తెలుసుకోండి. నీరు శరీరంలోని విషపూరిత మూలకాలను తొలగిస్తుంది. ఇది మీ శరీరంతో పాటు చర్మాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది.
ఆకుకూరలు తినండి:
విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థాలు శరీరానికి పోషణనిస్తాయి. ఇది మీ చర్మాన్ని యవ్వనంగా, శుభ్రంగా ఉంచుతుంది. కాబట్టి, మీ రోజువారీ ఆహారంలో బచ్చలికూర, మెంతులు, కాలే, బ్రోకలీ, దోసకాయ, చిలగడదుంప, క్యారెట్, క్యాప్సికమ్ వంటి కూరగాయలను మీ భోజనంలో చేర్చండి.
సీజనల్ పండ్లను తినండి:
సీజనల్ పండ్లను క్రమం తప్పకుండా తినండి. ఇది మీ శరీరానికి కూడా చాలా మేలు చేస్తుంది. ప్రతి సీజన్‌లో పండ్లను తీసుకోవడం మీ శరీరానికి అలాగే చర్మానికి చాలా ముఖ్యం. ఇది మిమ్మల్ని లోపలి నుండి అందంగా చేస్తుంది.
గ్రీన్ టీ తాగండి:
రోజూ గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ తాగడం వల్ల మొటిమల నుండి ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే., ఇది మొటిమలను నియంత్రించడంలో చాలా ప్రభావవంతమైన లక్షణాలను కలిగి ఉంటుంది. కొన్ని పరిశోధన ప్రకారం, గ్రీన్ టీలో పాలీఫెనాల్స్ సమ్మేళనాలు ఉన్నాయి.