ఏపీలో సకలం బంద్.. ఉద్యోగులకు జగన్ సర్కార్ బంపరాఫర్

జయహో జనతా కర్ఫ్యూ యావత్ దేశం. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ స్వచ్చంధ బంద్ కొనసాగనుంది. ప్రధాని మోదీ పిలుపుతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసికట్టుగా ముందుకొచ్చాయి.. జనతా కర్ఫ్యూకు చేయి, చేయి కలిపాయి. ఏపీలో జగన్ సర్కార్ కూడా ప్రజల సహకారంతో కర్ఫ్యూను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. ఇప్పటికే ఆర్టీసీ బస్సులు నిలిపివేయగా.. పెట్రోల్ బంక్‌లు కూడా మూతపడ్డాయి. ప్రజలంతా సంపూర్ణంగా జనతా కర్ఫ్యూకు మద్దతు పలికారు.

విజయవాడతో పాటూ మిగిలిన నగరాలు, పట్టణాల్లో ఉదయం ఆరు గంటల నుంచే జనతా కర్ఫ్యూ ప్రభావం కనిపిస్తోంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వం పిలుపునివ్వడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. శనివారమే ప్రజలు ఆదివారం కర్ఫ్యూకు సంబంధించి ప్రిపరేషన్లు చేసుకున్నారు.. నిత్యావసరాలకు ఇబ్బంది లేకుండా ముందుగానే తగినట్లు ఏర్పాట్లు చేసుకున్నారు.