లోక్‌సభలో కనువిందైన దృశ్యం చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, విపక్షనేత రాహుల్ గాంధీ ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. 18వ లోక్‌సభ స్పీకర్‌గా ఓంబిర్లా ఎన్నికైన వేళ ఆయనను స్పీకర్ స్థానానికి తీసుకెళ్లే క్రమంలో వీరిద్దరూ ఒకచోటకి వచ్చారు. మొదట స్పీకర్‌ను ప్రధాని మోదీ అభినందించగా ఆ తర్వాత రాహుల్ వచ్చి విష్ చేశారు. ఈక్రమంలోనే ఇద్దరూ ఒకరినొకరు పలకరించుకున్నారు.