హైదరాబాద్‌లోని పెద్ద అంబర్‌పేట్ వద్ద సినిమాటిక్ సీన్ కనిపించింది. ఓఆర్ఆర్‌పై పార్థీ గ్యాంగ్ హల్‌చల్ చేసింది. నల్గొండలో చోరీ చేసిన పార్థీ గ్యాంగ్ ఓఆర్‌ఆర్ పై పారిపోతుండగా.. వారిని పట్టుకునేందుకు పోలీసులు ఛేజ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఫైనల్‌గా నలుగురు పార్థీ గ్యాంగ్ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల నేషనల్ హైవే పార్కింగ్ చేసిన వాహనాలే టార్గెట్‌గా దుండగులు రెచ్చిపోతున్నారు. వరుస చోరీలతో హడలెత్తిస్తున్నారు. దీంతో ఈ గ్యాంగ్‌కు చెక్ పెట్టేందుకు నల్గొండ పోలీసులు యాక్షన్ ప్లాన్ రూపొందించారు. పక్కాగా నిఘా ఏర్పాటు చేశారు. నిందితులను పట్టుకునేందుకు స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. టెక్నాలజీని కూడా వినియోగించుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు.. దుండగులను గుర్తించి వెంబడించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోకి వచ్చాక ఇక్కడి పోలీసులను అలెర్ట్ చేశారు.