బెంగళూరు రేవ్ పార్టీ కేసు: 103 మందికి డ్రగ్స్ పాజిటివ్

hrufd.jpg

కొన్ని రోజుల కిందట బెంగళూరు నగర శివార్లలో ఓ ఫాంహౌస్ లో జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేయడం తెలిసిందే. ఓ వ్యాపారవేత్త ఏర్పాటు చేసిన ఈ రేవ్ పార్టీలో పలువురు తెలుగు సినీ నటులు, టీవీ నటులు, మోడల్స్ పట్టుబడ్డారు. ఇందులో 150 మంది నుంచి పోలీసులు రక్త నమూనాలు సేకరించి నార్కోటిక్స్ ల్యాబ్ కు పంపగా, అందులో 103 మందికి డ్రగ్స్ పాజిటివ్ అని వచ్చినట్టు వెల్లడైంది. రక్త నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నవారిలో ఒక టాలీవుడ్ నటి కూడా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.

Share this post

scroll to top