ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ కేసులో ఢిల్లీ పోలీసులు సీఎం కేజ్రీవాల్ నివాసంలోని సీసీటీవీ ఫుటేజీకి చెందిన డీవీఆర్‌ను స్వాధీనం చేసుకున్నారని ఆ పార్టీ ఆదివారం ప్రకటించింది.
అర్వింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేశాడని ఎంపీ స్వాతి మలివాల్ ఫిర్యాదు చేసడని ..ఏడు సార్లు తన చెంప ఛెళ్లుమనిపించాడని, ఛాతి, ఉదరభాగంలో తన్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, స్వాతి ఆరోపణలను ఆప్ ఖండించింది. బీజేపీ ప్రోద్బలంతోనే ఆమె తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. మరోవైపు, ఢిల్లీ పోలీసులు బిభవ్ కుమార్‌ను అరెస్టు చేయగా న్యాయస్థానం అతడికి ఐదు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఇక బిభవ్ కుమార్ కూడా స్వాతిపై ఫిర్యాదు చేశారు. సీఎం నివాసంలోకి ఆమె బలవంతంగా, అనుమతి లేకుండా ప్రవేశించారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ ఆదివారం పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఎంట్రీ గేట్లు, బౌండరీ గోడలపై ఉన్న సీసీటీవీ కెమెరాల డీవీఆర్‌లను శనివారం పోలీసులు సీజ్ చేశారు.