తెలంగాణ కాంగ్రెస్‌లో కోల్డ్ వార్ నడుస్తోంది. సీనియర్ నేతలకే పార్టీలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో జగిత్యాల రాజకీయం రసవత్తరంగా మారింది. ఎమ్మెల్సీ పదవికి జీవన్ రెడ్డి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, జగిత్యాల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరికపై స్థానిక నేత జీవన్ రెడ్డికి అధిష్టానం సమాచారం ఇవ్వలేదు. ఇక, సంజయ్ చేరికపై కాంగ్రెస్ శ్రేణుల్లో అసహనం నెలకొంది. దీంతో, జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, సోమవారం ఉదయం నుంచే జీవన్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. మరోవైపు.. జీవన్‌తో అధిష్టానం మాట్లాడుతున్నట్టు సమాచారం.