కాంగ్రెస్, బీజేపీలను తోడు దొంగలుగా అభివర్ణించారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, కేటీఆర్. తెలంగాణ హక్కులను కాపాడటంతో సీఎం రేవంత్‌రెడ్డి విఫలమయ్యారని.. ఇప్పటికే జలవనరులను తాకట్టు పెట్టారంటూ ఆయన దుయ్యబట్టారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇప్పుడు గనుల వేలానికి సిద్ధమయ్యారని.. అన్నింటినీ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ అబద్ధాలు చూసి తన సమాధిలో గోబెల్స్ ఉలిక్కిపడ్డారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బొగ్గు బ్లాకుల అమ్మకాలను బీఆర్‌ఎస్ పార్టీ వ్యతిరేకించిందని.. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్ర నదీ ప్రాంత హక్కుల రక్షణలో కాంగ్రెస్ విఫలమైంది. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణలో బీజేపీకి కాంగ్రెస్ సహకారం అందించింది’’ అని కేటీఆర్ మండిపడ్డారు.