ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో ట్విస్ట్‌.. పోలీసులకు బిగ్‌ షాక్‌..

phone-taping-05.jpg

తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అనారోగ్యం కారణాలతో ఇప్పట్లో తాను రాష్ట్రానికి రాలేనని కీలక నిందితుడు ప్రభాకర్‌ రావు తాజాగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు మరో మలుపు తిరిగింది. అయితే, ప్రభాకర్‌ రావు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నాంపల్లి కోర్టులో విచారణను హాజరవుతానని అఫిడవిట్‌ దాఖలు చేశారు. కానీ, ఇప్పుడు మాత్రం యూ టర్న్‌ తీసుకున్నారు. మరో వైపు.. ప్రభాకర్‌ రావుకు సీబీఐ బ్లూ కార్నర్‌ నోటీసులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇక, ఈ వ్యవహారంపై ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించాలంటే ఆయన పరారీలో ఉన్నట్టు చూపాలి. కానీ, కేసు విచారణకు ముందే ప్రభాకర్‌ రావు చికిత్స కోసం అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో, ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించే అవకాశం లేదు.

Share this post

scroll to top