సలార్ బుకింగ్స్ దాటేసిన ప్రభాస్ కల్కి..

prabas-25.jpg

ప్రభాస్ గత ఏడాది సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అప్పటివరకు వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న ప్రభాస్ కు సలార్ సినిమా పెద్ద ఊరటను ఇచ్చింది. సలార్ కు ముందు ప్రశాంత్ నీల్ కన్నడ స్టార్ హీరో యష్ తో కేజిఎఫ్ ,కేజిఎఫ్ 2 తెరకెక్కించారు. ఈ రెండు సినిమాలు భారీ విజయం సాధించి ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్స్ నమోదు చేసాయి.దీనితో ప్రభాస్ ,ప్రశాంత్ నీల్ సినిమాపై భారీగా క్రేజ్ ఏర్పడింది. దీనితో సలార్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా నమోదు అయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “.మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ కల్కి సినిమాను బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరక్కించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినీదత్ ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మించారు. మేకర్స్ కల్కి సినిమాను జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అయ్యాయి. ప్రభాస్ కల్కి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన కొన్ని నిముషాల్లోనే చాలా థియేటర్స్ హౌస్ ఫుల్ అయ్యాయి. గత ఏడాది వచ్చిన సలార్ అడ్వాన్సు బుకింగ్స్ ను కల్కి సినిమా రిలీజ్ ఒకరోజుకు ముందుగానే క్రాస్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. దీనితో ప్రభాస్ కల్కి సినిమాపై భారీగా క్రేజ్ ఏ రేంజ్ లో వుందో తెలుస్తుంది.

Share this post

scroll to top