ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మరణం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్విట్టర్ వేదికగా స్పందించారు. రామోజీరావు మరణంతో ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఓ టైటాన్‌ను కోల్పోయిందన్నారు. ఈనాడు న్యూస్ పేపర్, ఈటీవీ న్యూస్ నెట్‌వర్క్, రామోజీ ఫిల్మ్ సిటీ వంటి సంస్థలను స్థాపించిన ఆయన ఎంతో మందికి మార్గదర్శకుడు అన్నారు. పద్మవిభూషన్ లాంటి సత్కారాలను అందుకోని ఆయన సమాజంలో చెరగని ముద్ర వేశారని రాష్ట్రపతి కొనియాడారు. ఆయా రంగాల్లో ఆయన చేసిన సేవలు ఎనలేనివన్నారు. రామోజీరావు కుటుంబసభ్యులు, వెల్ విషర్స్‌కు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
- Home
- News
- Andhra Pradesh
- రామోజీరావు మృతి పట్ల రాష్ట్రపతి ముర్ము సంతాపం