మామిడి ఆకులలో ఉండే మాంగిఫెరిన్ యాంటీ మైక్రో బయల్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇది రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రించడంలో ప్రభావంతంగా పనిచేస్తుంది. ఇక మామిడి ఆకులను నీళ్లలో వేసి మరిగించి ఆ నీటిని రాత్రంతా ఉంచి ఉదయాన్నే దాన్ని వడకట్టుకుని ఖాళీ కడుపుతో తాగితే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. మామిడి ఆకులు కడుపులో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తాయి. శరీరంలోని అదనపు కేలరీలను బర్న్ చేసి లావు తగ్గేలా చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తాయి. ఉబ్బరం, వాపు, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు తొలగిపోతాయి.
లేత మామిడి ఆకులు మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు లేత మామిడి ఆకులను నమిలి తిన్నా, లేదా మామిడి ఆకులను మరిగించి కషాయంలా తీసుకున్న మధుమేహం అదుపులో ఉంటుంది. మామిడి ఆకులలో ఉండే మాంగిఫెరిన్ యాంటీ మైక్రో బయల్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇది రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రించడంలో ప్రభావంతంగా పనిచేస్తుంది.