రాహుల్‌‌ పిలిస్తే వస్తానన్నావ్..

rahul-01.jpg

తెలంగాణలో ప్రజలు, యువత, చిన్నారులు ఎప్పుడు పిలిచిన వస్తానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎన్నికల సమయంలో మాట్లాడారు. తాను సోనియాగాంధీ సైతం తెలంగాణ ప్రజల వెంట ఉన్నామని అన్నారు. తుక్కుగూడలో రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన వీడియోను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ ప్రశ్నించారు.

‘ప్రియమైన రాహుల్ గాంధీ, మీ సీఎం బుల్డోజర్ రాజకీయాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల గళం మీకు వినిపిస్తుందా? యువత, ప్రజలు, చిన్నారి పిలిచిన వస్తానని మీరు వాగ్దానం చేశారు. కాంగ్రెస్ న్యాయ పత్ర విడుదలలో తుక్కుగూడ నుంచి మీ వీడియో ఉంది. మీ మాట మీద నిలబడండి, వాస్తవాన్ని మీరే చూసుకోండి, మూసీ ప్రాజెక్టు బాధిత ప్రజలను కలవండి’ అని కేటీఆర్ రాహుల్‌గాంధీకి ఎక్స్‌లో సూచనలు చేశారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో తాజాగా వైరల్‌గా మారింది.

Share this post

scroll to top