రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ. 5 కోట్లు భారీ విరాళం ప్రభాస్ ప్రకటించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం సహాయ నిధికి రూ.2.5 కోట్ల చొప్పున మొత్తం 5 కోట్ల రూపాయాలను ఇస్తున్నట్లు తెలిపారు. అలానే వరదలకు గురైన ప్రాంతలో ప్రజలకి భోజనాలు నీళ్లు ప్రభాస్ ఏర్పాటు చేశారు. కష్టాల్లో ఉన్నవారికి తన వంతు సాయం అందించడానికి ఎప్పుడూ ముందుంటారు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్. అలానే తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. గతంలో కూడా అనేక సందర్భాల్లో ప్రభాస్ తన మంచి మనస్సును చాటుకున్నారు. విపత్తులకు విరాళల ఇవ్వడం, ఆపదలో ఉండే వారిని ఆదుకోవడంలో ప్రభాస్ ముందుటారు. ఇక ఆయన చేసే అన్నదానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
- Home
- News
- Andhra Pradesh
- తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించిన ప్రభాస్..