తెలుగు రాజకీయాల్లో త్వరలో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతున్నది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకే వేదికను పంచుకోబోతున్నారు. హైదరాబాద్ వేదికగా జులై 21 తేదీలలో జరగబోయే తొలి ప్రపంచ కమ్మ మహాసభకు ఈ ఇరువురు ముఖ్య అతిథులుగా హాజరుకాబోతున్నట్లు కమ్మ మహాసభ వ్యవస్థాపకుడు జెట్టి కుసుమకుమార్ వెల్లడించారు. హైదరాబాద్ లోని హెచ్ఐసీసీ లో నిర్వహిస్తున్న ఈ వేడుకలకు రేవంత్ రెడ్డి, చంద్రబాబుతో పాటు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. భారత దేశ జనాభాలో 1.5 శాతం, ప్రపంచవ్యాప్తంగా 2.1 కోట్ల మంది కమ్మ సామాజిక వర్గీయులు ఉన్నారని వీరిని ఒకే వేదికపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో పని చేస్తున్నట్లు కుసుమ కుమార్ చెప్పారు.