నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు నాయకులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తదితర తెలంగాణ నేతలు కూడా ఆయనను గుర్తు చేసుకుంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.