ఇంక నామినేషన్స్ లో అయితే నెక్ట్స్ లెవల్ అంతే. ఎందుకంటే నా నామినేషన్ లో మీరు ఎవరు మాట్లాడటానికి అంటూ ముగ్గురు చీఫ్స్ ని విదిలించి పారేసింది. తన పాయింట్స్ చెప్పేసి.. కేకలు వేస్తూ వాదనకు దిగింది. అయితే ఇక్కడే కాస్త నెగిటివిటీ వచ్చింది. ఆమె అవతలి వారికి అసలు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదు. నామినేట్ చేస్తూ డిఫెండ్ చేసుకునేందుకు ఛాన్స్ ఇవ్వకుండా అరిచేస్తోంది. నామినేషన్స్ లో మాత్రం ఆమెకు నెగిటివ్ అయ్యింది. అలాగే ప్రతి విషయాన్ని సీరియస్ గా ఇష్యూ చేయడం కూడా ఆమెకు నెగిటివ్ అవుతోంది. అందరికి విసుగు వస్తోంది.
అయితే ఏం చేస్తే మనకు ప్రియారిటీ ఇస్తారు అనే విషయం మాత్రం సోనియాకి క్లారిటీ ఉంది. అందుకే అవతలి వారిని ట్రిగర్ చేసి వదిలేస్తోంది. అప్పటి వరకు కూల్ గా కనిపించిన ప్రేరణను ఒక్క మాటతో కేకలు వేసేలా చేసింది. ఆమె టెంపర్ ని లూజ్ అయ్యేలా చేసి.. సోనియా మాత్రం చాలా కూల్ గా మాట్లాడింది. ఇలా కెమెరా స్పేస్ కోసం ప్రతి విషయాన్ని గొడవగా చేస్తే సోనియాకి నెగిటివ్ అయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతానికి అటెన్షన్ గ్రాబ్ చేయడంలో సక్సెస్ అవుతోంది. తాను చెప్పాలి అనుకున్నది బాగా చెప్తోంది. కానీ, కాస్త ల్యాగ్, అనవసరపు ప్రస్తావనలు తగ్గించుకుంటే బాగుంటుంది.