ఆ వార్త విని షాక్‌కి గురయ్యా!.. ఆయనో అబద్ధాలకోరు, ఎమ్మెల్యేగా ఎలా గెలిచాడో..

rrr-13.jpg

ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన అక్రమ కేసుల వ్యవహారంపై  బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్‌ వేదికగా స్పందించారు. డీజీపీ ర్యాంకులో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారులపై, మాజీ సీఎం వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి మీద ఎఫ్ఐఆర్ నమోదైందన్న వార్త తనను షాక్‌కు గురిచేసిందని అన్నారాయన. ఈ క్రమంలో రఘురామ వ్యవహారశైలిపైనా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  మాజీ ఎంపీ, ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యేగా ఉన్న రఘురామకృష్ణరాజును వేధించారనే ఆరోపణలపై మాజీ సీఎం వైఎస్ జగన్, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు పీవీ సునీల్ కుమార్, పీఎస్ఆర్ ఆంజనేయులు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్నిఆర్‌ఎస్సీ తన ట్వీట్‌లో తప్పుబట్టారు. ఈ అంశాన్ని అప్పట్లోనే కోర్టులు విచారించాయని.. అయితే అందులో ఏమీ బయటకు రాలేదని అభిప్రాయపడ్డారు. అధికారం మారడం తప్ప మూడేళ్లలో ఏం మారిందని.. మూడేళ్ల తర్వాత అకస్మాత్తుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. 

Share this post

scroll to top