నటుడు కైకాల సత్యనారాయణకు తీవ్ర అస్వస్థత… వెంటిలేటర్ పై చికిత్స

నట దిగ్గజం కైకాల సత్యనారాయణ మరోసారి ఆసుపత్రి పాలయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాదు అపోలో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.ఇటీవల తన ఇంట్లో జారిపడిన కైకాల సత్యనారాయణ కొన్నిరోజుల పాటు సికింద్రాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందారు. డిశ్చార్జి అయిన తర్వాత ఆయన తాజాగా తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. కాగా, సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై సినీ ప్రముఖులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షిస్తున్నారు. సత్యనారాయణ వయసు 86 సంవత్సరాలు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.