ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి..

chowdary-19.jpg

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్నికైయ్యారు. ఏడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన గోరంట్లకు ప్రొటెం స్పీకర్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారు. ప్రొటెం స్పీకర్‌గా నియామకంపై ఎమ్మెల్యే గోరంట్ల స్పందించారు. రేపు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎదుట ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేస్తాను అని చెప్పుకొచ్చారు. ఇక, ఎల్లుండి నుంచి రెండు రోజులు పాటు ప్రొటెం స్పీకర్‌గా 174 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారాలు చేయిస్తాను అని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. నాకు వచ్చింది పెద్ద పదవి ఏమి కాదు.. ప్రొటెం స్పీకర్‌ నా బాధ్యతగా భావిస్తాను.. మాజీ ముఖ్యమంత్రి జగన్ అయినా అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం చేయాలి అని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగుతాయని ఆశిస్తున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు.

Share this post

scroll to top