ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం కాదని.. మతపరమైన రిజర్వేషన్లకు మాత్రమేనని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి కార్యక్రమం నిర్వహించారు. శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి లక్ష్మణ్, బీజేపీ నేతలు నివాళులు అర్పించారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. విభజన అంశాల విషయం లో ప్రాంతీయ ను రెచ్చగొట్టి రాజకీయంగా ఉపయోగించుకోవద్దని తెలిపారు. కేంద్రం, మోడీ రెండు రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని తెలిపారు. తిరుపతి పవిత్రతను కాపాడాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి బహిరంగ లేఖ రాస్తున్నా అన్నారు. భారత దేశ సమగ్రత కోసం తన ప్రాణాలు సైతం అర్పించారు శ్యామా ప్రసాద్ ముఖర్జీ అన్నారు. భావితరాలకు, నేటి తరాలకు స్ఫూర్తిని కలిగించేలా శ్యామా ప్రసాద్ ముఖర్జీ పేరుతో అనేక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. పశ్చిమ బెంగాల్ ను తూర్పు పాకిస్తాన్ లో కలుపుతారనే కుట్రల నేపథ్యంలో ఎదురొడ్డి నిలబడ్డారని తెలిపారు.